Wednesday, August 19, 2026
HomeTelanganaమాలీలను ఎస్టీ జాబితాలో చేర్చాలి.

మాలీలను ఎస్టీ జాబితాలో చేర్చాలి.

📰 Generate e-Paper Clip

ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేసిన రాష్ట్ర మాలీ సంఘం అధ్యక్షులు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాలీలను ఎస్టీ జాబితాలో చేర్చాలని మహాత్మ జ్యోతిబాఫూలే మాలీ సంక్షేమ సంఘం, తెలంగాణ రాష్ట్రం ఆధ్వర్యంలో సోమవారం మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు నివాస గృహం వద్ద వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు లెండుగురె శ్యాంరావు మాట్లాడుతూ.

గతంలో గిరిజనుల రిజర్వేషన్ ను 10శాతానికి పెంచుతూ అందులో మాలీ కులస్థులకు చోటు కల్పిస్తూ కేంద్రానికి బిల్లు పంపడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా మాలీలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటే 10 శాతానికి గిరిజన రిజర్వేషన్ పెంచుతున్న జీ.వో.లో మాలీలను కలుపుతూ మాలీలకు ఎస్టీ హోదా కల్పించి సామాజిక న్యాయం చెయ్యాలని కోరుతున్నామన్నారు. ఇట్టి విషయమై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదె వసంత్ రావు, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు సెండె సత్యనారాయణ, రాష్ట్ర కమిటీ సభ్యులు వడై మోతేరావు, జిల్లా నాయకులు నెండుగూరి మధు, సెండె కొండన్న, బాపురావు, కాగజ్ నగర్ మండల అధ్యక్షులు కొట్రంగె నాందేవ్, జిల్లా యువజన సంఘం ప్రధాన కార్యదర్శి నెండుగూరి సంతోష్ కుమార్, మరియు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.