Wednesday, August 19, 2026
HomeCrimeమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆఫీస్ బాయ్ ఆత్మహత్య

మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆఫీస్ బాయ్ ఆత్మహత్య

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ జిల్లా: తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆఫీస్ బాయ్ గా పనిచేస్తున్న దేవేందర్ (19) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ లో ఉన్న మంత్రి కార్యాలయంలోని ఓ గదిలో ఉరివేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు.. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలో చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.

ఈ ఘటనపై ఆర్మూర్ ఏసీపీ మీడియాతో మాట్లాడారు. మృతిచెందిన యువకుడు ఓ మహిళతో సన్నిహితంగా మెలిగినట్లు ప్రాథమిక విచారణలో తెలిసిందని చెప్పారు. ఆత్మహత్యకు ముందు తాను చనిపోతున్నట్లు యువకుడు ఆమెకు సందేశం పంపించినట్లు తెలిపారు. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.