
మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని ఐబి చౌరస్తాలో మంగళవారం తెల్లవారుజామున లారీ ఢీకొని ఇద్దరు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డు పక్కన విధులు నిర్వహిస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో ఆత్మకూరు లస్మయ్య, చెన్న మల్లేష్ అనే కార్మికులకు గాయాలయ్యాయి. వెంటనే వారిని ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుండి కరీంనగర్ తరలించారు. ఈ విషయం తెలిసిన వెంటనే మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య ఆసుపత్రిలో కార్మికులను పరామర్శించారు.

