Monday, August 17, 2026
HomeTelanganaసికింద్రాబాద్ అల్లర్లు.. పక్కా ప్రణాళిక ప్రకారం జరిగినవే: బండి సంజయ్

సికింద్రాబాద్ అల్లర్లు.. పక్కా ప్రణాళిక ప్రకారం జరిగినవే: బండి సంజయ్

📰 Generate e-Paper Clip

కామారెడ్డి జిల్లా: నగరంలో అగ్నిపథ్ కు వ్యతిరేకంగా జరుగుతున్న అల్లర్లపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. హైదరాబాద్ నుంచి బాసర ట్రిపుల్ ఐటీకి బయలుదేరిన ఆయన.. సికింద్రాబాద్ లో చెలరేగిన అల్లర్లపై స్పందిస్తూ కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మీడియాతో మాట్లాడారు. “ఆర్మీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థుల ముసుగులో కొంతమంది వచ్చి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పై దాడి చేశారు. తెరాస, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు కలసి చేసిన కుట్రలో భాగమే ఈ అల్లర్లు. ఇంత మంది ఆందోళనకారులు వస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? ఇదంతా పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగింది. ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ఏం చేస్తోంది? రాష్ట్ర ప్రభుత్వం చేసిన దాడి ఇది. ముసుగులు వేసుకుని వచ్చి దాడికి పాల్పడ్డారు. అందుకే తెలంగాణలో బుల్డోజర్ ప్రభుత్వం రావాలి. అగ్నిపథ్ పేరుతో అభ్యర్థులకు అన్యాయం చేసే ఆలోచన కేంద్రానికి లేదు. కొందరు వారిని తప్పుదారి పట్టిస్తున్నారు. విద్యార్థులంతా గొప్ప వ్యక్తులు. వాళ్లు ఇలా చేస్తారని నేను అనుకోను..

దేశ ప్రజల ఆస్తి.. మన ఆస్తి. రాష్ట్ర ప్రభుత్వం విధ్వంసాన్ని ప్రోత్సహిస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవు. కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా రాష్ట్రం వ్యవహరిస్తోంది. నిన్నటి కాంగ్రెస్ దాడి, ఇవాల్టి అల్లర్లు పూర్తిగా తెరాస ప్రోద్బలంతోనే జరిగాయి” అని బండి సంజయ్ ఆరోపించారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.