Tuesday, August 18, 2026
HomeTelanganaవిద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగటం..!

విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగటం..!

📰 Generate e-Paper Clip

మంచిర్యాల జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం పెంచినటువంటి విద్యార్థుల బస్ పాస్ ఛార్జ్ లను వెంటనే తగించాలని కోరుతూ మంచిర్యాల బస్ డిపో ముందు ఎన్.ఎస్.యూ.ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్.ఎస్.యూ.ఐ జిల్లా అధ్యక్షులు ఆదర్శ్ వర్ధన్ రాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో డీజిల్ సెస్ అని విద్యార్థుల బస్ పాస్ ఛార్జ్ లను 3రేట్లు పెంచి విద్యార్థులను చదువుకు దూరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందని అన్నారు. ప్రతి గ్రామంలో హైస్కూల్, మండలంలో ఇంటర్ కాలేజీ, నియోజకవర్గం లో పీజీ కాలేజీ లను నిర్మించకుండా పేద విద్యార్థులు దూర ప్రాంతానికి వెళ్లి చదువుకుందాం అంటే అమాంతం బస్ పాస్ రేట్లను పెంచడం సిగ్గుచేటని ఇప్పటికే ప్రైవేటు విద్యాసంస్థల విద్యార్థుల దగ్గర నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రభుత్వానికి పట్టింపు లేకుండా వారి మీద మరో పెను భారంగా బస్ ఛార్జ్ లను పెంచడం చాలా బాధాకరమని ఆయన విచారణ వ్యక్తం చేశారు.

విద్యుత్, డీజిల్, పెట్రోల్, నిత్యా వసరాలు రేట్ లను పెంచి ఇప్పుడు బస్ ఛార్జ్ లను పెంచి సామాన్యుడి. నడ్డి విరిచిందని అన్నారు. ఉద్యోగుల నోటిఫికేషన్ సమయంలో విద్యార్థులు చదువు కోసం దూర ప్రాంతాలు పయనిస్తుంటారని అలాంటి సమయంలో ఇటువంటి తప్పుడు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఢిల్లీలో మహిళలకు ఉచిత బస్ పాస్ ఉన్నట్టు మన తెలంగాణలో కూడా విద్యార్థులకు <span;>ఉచిత బస్ పాస్ ఇవ్వాలని ఎన్.ఎస్.యూ.ఐ తరుపున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.యూ.ఐ నాయకులు శివ ప్రసాద్, సూరజ్, శివ నాని, టిపిసిసి సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఏల్పుల రోహిత్, యూత్ నాయకులు ప్రదీప్, ఎన్.ఎస్. యూ.ఐ బెల్లంపల్లి మండల ఉపాధ్యక్షుడు చిలుముల సాయికుమార్, రోషన్, ఉమేష్, నవీన్, ప్రణయ్, రాజమౌగిలి, సాయి కిరణ్, వెంకట్, జశ్వంత్, సాయి కిరణ్, సురేష్, వినయ్, టింకు, సుశాంత్, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.