Tuesday, August 18, 2026
HomeTelanganaరెడ్ క్రాస్ సొసైటీకి మెమోంటో ప్రధానం చేసిన గవర్నర్

రెడ్ క్రాస్ సొసైటీకి మెమోంటో ప్రధానం చేసిన గవర్నర్

📰 Generate e-Paper Clip

మంచిర్యాల జిల్లా: జాతీయ రక్తదాతల దినోత్సవం సందర్భంగా మంగళవారం మంచిర్యాల రెడ్ క్రాస్ సొసైటీకి రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ మెమోంటో, సర్టిఫికెట్ ప్రదానం చేశారు. హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో తలసేమియా, సికిల్ సెల్ వ్యాధిగ్రస్తుల వ్యాధిగ్రస్తుల సహాయార్ధం సింగరేణి శ్రీరాంపూర్ విటీసీ మెగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసినందుకు జిఎం సంజీవరెడ్డి, విటిసి మేనేజర్ కెవి రామారావు మెమోంటో, సర్టిఫికెట్ స్వీకరించారు. అలాగే పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా బెల్లంపల్లి ఎసిపి ఎడ్ల మహేష్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు నిర్వహించి అత్యధిక యూనిట్స్ రక్తం సేకరించినందుకు గవర్నర్ మెమోంటో, సర్టిఫికెట్ అందజేశారు. వారి తరుపున రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల జిల్లా చైర్మన్ కంకణాల భాస్కర్ రెడ్డి, వైస్ చైర్మన్ చందూరి మహేందర్, కోశాధికారి పడల రవీందర్, జీవిత కాల సభ్యుడు కాసర్ల రంజిత్ కుమార్ పతకాలను అందుకున్నారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.