Wednesday, August 19, 2026
HomeTelanganaనిరుద్యోగ యువతకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్..!

నిరుద్యోగ యువతకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్..!

📰 Generate e-Paper Clip

 

హైదరాబాద్: తెలంగాణలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) శుభవార్త తెలియజేసింది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్ పాస్లపై 20 శాతం రాయితీ కల్పిస్తూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. మూడు నెలలపాటు ఈ పాస్లను కొనసాగిస్తామని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ వెల్లడించారు. బస్పన్ల కోసం దరఖాస్తు చేయాలనుకునే యువతీ యువకులు ఆధార్ కార్డు జిరాక్స్, కోచింగ్ సెంటర్కు సంబంధించిన ఐడీ కార్డు జిరాక్స్, నిరుద్యోగ గుర్తింపు కార్డులలో ఏదో ఒకదాన్ని బస్పస్ తీసుకునే సమయంలో అందజేయాలని ఆర్టీసీ తెలిపింది. మూడు నెలలకు గాను ప్రస్తుతం ఆర్డినరీ బస్పస్ కు రూ. 3,450 వసూలు చేస్తున్నారు. 20శాతం తగ్గించిన తర్వాత రౌండప్ చేసి రూ.2,800 వసూలు చేయనున్నారు. అదే విధంగా మెట్రో ఎక్సప్రెస్కు ప్రస్తుతం. రూ.3,900 వసూలు చేస్తున్నారు. 20 శాతం రాయితీ పోగా రౌండప్ చేసి రూ.3,200 వసూలు చేయనున్నట్లు  తెలంగాణ ఆర్టీసీ నూతన కాల్ సెంటర్ను ప్రారంభించినట్లు యాజమాన్యం తెలిపింది.

040-2345-0033, 040-6944 0000 నంబర్ కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. 24 గంటల సౌకర్యాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ సూచించింది. రిజర్వేషన్ రద్దుకు సంబంధించిన నగదు, బస్సుల వివరాలు ఈ నంబర్కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని ఆర్టీసీ తెలిపింది..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.