Monday, August 17, 2026
HomeTelanganaవీఆర్ఎస్ కు ఎవర్నీ బలవంతం చేయట్లేదు: సజ్జనార్

వీఆర్ఎస్ కు ఎవర్నీ బలవంతం చేయట్లేదు: సజ్జనార్

📰 Generate e-Paper Clip

హైదరాబాద్: స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఆర్ఎస్) కోసం ఉద్యోగులెవర్నీ బలవంతం చేయట్లేదని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఉద్యోగుల వీఆర్ఎస్ సంఖ్యను బట్టి ప్యాకేజీ సిద్ధం చేస్తామని చెప్పారు. హైదరాబాద్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. వీఆర్ఎస్ కు ఇప్పటికే 2వేల మంది పేర్లు నమోదు చేసుకున్నారని సజ్జనార్ తెలిపారు. వీఆర్ఎస్ అంశం తేలాక ఆర్టీసీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. మరోవైపు ఉప్పల్ నుంచి యాదాద్రికి మినీ బస్సు సర్వీసులను టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ ప్రారంభించారు. టికెట్ ధర జేబీఎస్ నుంచి రూ.100, ఉప్పల్ నుంచి రూ. 75గా నిర్ణయించారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.