గొంతు కోసుకుని యువకుడు ఆత్మహత్యయత్నం..
- వెంటనే స్పందించిన వాంకిడి ఎస్ఐ ఢీకొండ రమేష్…
- చికిత్స కోసం ఆసుపత్రికి తరలింపు
*కొమురంభీం అసిఫాబాద్ జిల్లా:* వాంకిడి మండల కేంద్రానికి చెందిన పెందూర్ అఖిలేష్ అనే యువకుడు గొంతు కోసుకుని ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు. గొంతుకోసుకున్నాక సెల్ఫీ వీడియో తీసిన యువకుడు.
స్థానికుల సమాచారంతో వెంటనే స్పందించిన వాంకిడి ఎస్ఐ ఢీకొండ రమేష్… మూడు బృందాలుగా ఏర్పడి వెతకడంతో ..సెల్ ఫోన్ టవర్ లొకేషన్, యువకుని సెల్ఫీ వీడియో బాక్ గ్రౌండ్ విజ్యువల్స్ ను కనుగొని.. యువకున్ని కనుగొన్న పోలీసులు. అపస్మారక స్థితిలో ఉన్న యువకున్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రేమ వైఫల్యమే ఆత్మహత్యాయత్నానికికు గల కారణమని అనుమానిస్తున్నారు. *వివరాలు తెలియాల్సి ఉంది.