Telugu Updates
Logo
Natyam ad

ప్రపంచ స్థాయి నాన్ స్టాప్ కళాకారుల ప్రదర్శన..!

మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని ఎ ఎఫ్ సి ఎ ఫంక్షన్ హాల్లో భాష సాంస్కృతిక శాఖ వారి ఆధ్వర్యంలో శనివారం- ఆదివారం రెండు రోజులు జరిగిన అంతర్జాతీయ సాహితి, సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ శ్రీ శ్రీ కళా వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కట్ల భాగ్యలక్ష్మి గారు ఏర్పాటు చేసిన ఇరవై నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాలు 24 సెకండ్ల ప్రపంచ స్థాయి నాన్ స్టాప్ కళాకారుల వేదిక – కళా ప్రదర్శన అభినందనీయం.. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల నుండి అనేక కళాకారులు హాజరయ్యారు, కవులు, రచయితలు, నృత్య కారులు, జానపద కళాకారులు, రంగస్థలం కళాకారులు, ఇతరకళా రంగాలలో నిష్ణాతులైన వారు పాల్గొని అత్యంత ప్రతిభను కనబరిచారు., దీనిలో భాగంగా మంచిర్యాల జిల్లా శ్రీ నందిని నృత్యాలయం గురువు నాట్య విభూషణి అన్నం కల్పన గారి శిష్య బృందం అద్భుతమైన నృత్య ప్రదర్శనలతో పలువురిని ముగ్ధులను చేశారు.. ఈ సందర్భంగా వారికి ప్రశంసా పత్రాలను అందజేసి మెమొంటో లతో ఘనంగా సన్మానించారు.. ఈ సందర్భంగా కళా ప్రదర్శనకు సహకరించిన కళా కారులకు, కళ పోషకులకు, రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు కట్ల భాగ్యలక్ష్మి ధన్యవాదాలు తెలిపారు. నృత్యం చేస్తున్న శ్రీ నందిని నృత్యాలయం చిన్నారులు

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, శ్రీ శ్రీ కళా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కత్తిమండ ప్రతాప్, ఇతర కళాకారులు తదితరులు పాల్గొన్నారు.