Telugu Updates
Logo
Natyam ad

మద్యం మత్తులో కత్తితో వీరంగం.. ఇద్దరి పై దాడి..?

ఆదిలాబాద్ జిల్లా: ఆదిలాబాద్ పట్టణంలోని ఓ బార్ లో యువకుడు మద్యం మత్తు లో వీరంగం సృష్టించాడు. పీకల వరకు మద్యం తాగి బిల్లు అడిగినందుకు ఏకంగా బార్ యజమాని తో పాటు పలువురు పై కత్తితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆదిలాబాద్ పట్టణంలోని దేవి బార్ అండ్ రెస్టారెంట్ లో శనివారం రాత్రి మద్యం తాగేందుకు వచ్చిన ఇద్దరు సయ్యద్ అబ్బ సునీల్ అనే యువకులు పీకల వరకు మద్యం తాగారు. అనంతరం మద్యం బిల్లు 400 కావడంతో బార్ వేటర్ బిల్లు అడగగా, మద్యం తాగిన వారిలో ఓ యువకుడు ఏకంగా కత్తి ని చూపిస్తూ హల్చల్ చేశాడు. గొడవ చెలరేగడంతో అక్కడికి చేరుకున్న బార్ యజమాని నరేష్ రెడ్డి తో పాటు మరో వ్యక్తి రఘు పై మద్యం మత్తులో యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఇద్దరి చేతులకు గాయాలయ్యాయి. వెంటనే బార్ కు సంబంధించిన సిబ్బంది కత్తితో హల్చల్ చేసిన యువకుడిని చితకబాదారు..

పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మద్యం మత్తు లో హల్చల్ చేసిన ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. గాయపడిన వారిని ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు..