ఆదిలాబాద్ జిల్లా: ఆదివాసి హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) కు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబూరావు గుడ్ బై చెప్పారు. తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షునిగా పని చేస్తున్న ఎంపీ సోయం బాపురావు రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ ప్రకటించారు. తుడుం దెబ్బలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు కలత చెందిన తాను తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తప్పుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. దీంతో తుడుం దెబ్బ రాష్ట్ర నూతన అధ్యక్షులుగా బురస పోచ్చయ్య ను ఎన్నుకున్నారు..