వీఆర్ఎ దారుణ హత్య…!
మంచిర్యాల జిల్లా: కన్నెపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో దారుణం చోటుచేసుకుంది. కొత్తపల్లి వీఆర్ఎగా పనిచేస్తున్న దుర్గంబాబును (50) దుండగులు హత్య చేశారు. సోమవారం ఉదయం రక్తపు మడుగులో విగతజీవిగా పడివున్న దుర్గంబాబును గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..