మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
పాఠశాలలకు తాళం వేసి ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్,
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: తాండూరు మండలంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. మొదటగా తాండూర్ మండలానికి చెందిన ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి అక్కడున్న రోగులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రిలో గల డాక్టర్ మొదటగా ఓపీలు చూసినా అనంతరమే బయట పనులు చూడాలని సూచించారు. ఆస్పత్రికి వచ్చే రోగులకి డ్రింకింగ్ వాటర్ సౌకర్యం కల్పించాలని ఆస్పత్రిలో సిబ్బంది డాక్టర్ రోగుల పట్ల మర్యాదగా వ్యవహరిస్తూ మంచి వైద్యం అందించాలన్నారు. మండల వైద్యాధికారి అందుబాటులో ఉండాలని ఆస్పత్రి ప్రాంగణంలో శానిటేషన్ చేయించాలని వారన్నారు. అనంతరం తాండూర్ జెడ్.పి.ఎస్.హెచ్ పాఠశాలకు వెళ్లగా పాఠశాల ముఖద్వారం తాళం వేసి ఉండడంతో కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ రోజు హాలిడే లేదే మరి పాఠశాల ఎందుకు తెరవలేదంటూ పై అధికారులతో చరవాణిలో సంభాషించారు. ఇప్పటికే వస్తున్న సెలవులతో పిల్లల చదువులు పూర్తి అవ్వడం లేదని ఇలా సెలవులు పెట్టుకోవడం సరికాదంటూ సంబంధిత పాఠశాల సిబ్బందిపై వేటువేయక తప్పదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం తాండూరు గ్రామపంచాయతీ కార్యాలయం వద్దగల నర్సరీని సందర్శించారు. ప్రతిరోజు పరిశుద్ధ కార్మికులతో తప్పకుండా పారిశుద్ధ పనులు చేయించాలని దీనితో సీజన్ వ్యాధులు రావని సూచించారు. అనంతరం అచలాపూర్ జడ్పీఎస్ హెచ్ పాఠశాలను సందర్శించి అనంతరం తాండూర్ మండలానికి చెందిన కస్తూర్బా గాంధీ పాఠశాల ను మరియు జ్యోతిబాపూలే హాస్టల్లో సందర్శించారు. అక్కడున్న విద్యార్థులతో మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తేలుసుకున్నారు. విద్యార్థులు పాఠశాలలో బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చెందాలని వారన్నారు. అనంతరం మాదారం గ్రామపంచాయతీ పరిధిలో గల పాఠశాల పాత భవనాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో తాండూర్ ఎంఆర్ఓ ఇమ్రాన్ ఖాన్, తాండూర్ ఎంపీడీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.