
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల వాసవి క్లబ్ ఆధ్వర్యంలో అమావాస్య సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ముందు పేదలకు ఆదివారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వాసవి క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో ప్రతినెల పౌర్ణమి సందర్భంగా రైల్వే స్టేషన్ ముందు అన్నదాన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా సెప్టెంబర్ నుండి అమావాస్య సందర్భంగా కూడా ప్రభుత్వ ఆసుపత్రి ముందు అమావాస్య సందర్భంగా నిరుపేదలకు అన్నదానం ప్రారంభించారు. అన్నప్రసాద వితరణ కార్యక్రమంకు దాతగా సహకరించిన స్వర్గీయ చిలువేరు సత్యమ్మ – కిష్టయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు కోడలు చిలువేరు స్వరాజ్యం – మల్లికాంబ దంపతులు సహకరించారు. ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షుడు కేశెట్టి వంశీకృష్ణ, కార్యదర్శి నలుమాసు ప్రవీణ్, అంతర్జాతీయ వాసవి క్లబ్ అధ్యక్షులు ముక్త శ్రీనివాస్, కటకం హరీష్ ,క్యాబినెట్ కోశాధికారి పుల్లూరి బాలమోహన్, అంతర్జాతీయ ప్రోగ్రాం కోఆర్డినేటర్ కొండ చంద్రశేఖర్ , జిల్లా వికేఎస్పీ ఇన్చార్జి అప్పాల శ్రీధర్ , రీజియన్ చైర్మన్ వుత్తూరి రమేష్, జోన్ చైర్మన్ కొంకముట్టి వెంకటేశ్వర్లు జిల్లా ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి చిలువేరు శ్రీనివాస్, గంప నాగేందర్, చకినారపు రమేష్, చందూరి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

