Telugu Updates
Logo
Natyam ad

గంటలోపే లారీని ఛేదించి పట్టుకున్న వాంకిడి ఎస్ఐ

కొమురం భీం అసిఫాబాద్ జిల్లా: వాంకిడి మండలం ఇందాని క్రాస్ రోడ్ సమీపంలో ఆసిఫాబాద్ కు చెందిన సెయింట్ మేరీస్ పాఠశాల బస్సును లారీ ఢీ కొట్టడంతో నలుగురు విద్యార్థులకు తీవ్రగాయాలు అయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న వాంకిడి ఎస్ఐ ఢీకొండ రమేష్ స్కూల్ బస్ డ్రైవర్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం గ్రీన్ కలర్ టిప్పర్ లారీగా గుర్తించి మంచిర్యాల్ వైపుకు వెళ్లిందని తెలుసుకున్నారు. ఆ రూటులో అందరిని అలెర్ట్ చేయగా గోలేటి ఎక్స్ రోడ్డు సమీపంలోని ఒక మెకానిక్ షెడ్ వద్ద లారీ మరమత్తులు చేయిస్తుండగా దానిని పట్టుకోవడం జరిగింది. లారీ ముందు భాగంలో బస్సుకు సంబంధించిన పసుపు రంగు ఆనవాళ్ళను గుర్తించి స్కూల్ బస్సును వెనుక నుండి ఢీ కొట్టిన లారీగా గుర్తించి పట్టుకోవడం జరిగిందని, లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నట్టు ఎస్ఐ ఢీకొండ రమేష్ తెలిపారు. గంటలోపే కేసును ఛేదించి లారీని లారీ డ్రైవర్ ను పట్టుకున్న వాంకిడి ఎస్ఐ డీకొండ రమేష్ ను స్థానీకులు అభినందించారు..