జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్

ఆంజనేయులు న్యూస్, కల్వకుర్తి: నాగర్ కర్నూల్ జిల్లా ఉర్కొండ మండల పరిధిలోని ఉర్కొండ పేటలో వివాహితపై అత్యాచారం చేసిన నిందితులను ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నామని జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ అన్నారు. ఈ విషయమై బుధవారం కల్వకుర్తి పట్టణంలోని డిఎస్పి కార్యాలయ ఆవరణలో విలేకరుల సమవేశం ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పి తెలిపిన వివరాల ప్రకారం.. ఉర్కొండ మండలం, ఉర్కొండ పేట గ్రామానికి చెందిన మర్పాకుల ఆంజనేయులు(25), ఎండి సాదిక్ బాబా(28), వాగుల్దాస్ మణి(21), కార్తీక్(20), మట్ట మహేష్ గౌడ్(28), హరీష్ గౌడ్(23), మట్ట ఆంజనేయులు(24) ఏడుగురు సభ్యుల ముఠా వీరు. ఉర్కొండ పేట ఆంజనేయ స్వామి దేవాలయానికి వచ్చే భక్తులపై నిఘా ఉంచేవారు. అదే నేపథ్యంలో శనివారం ఓ వివాహిత(27) తన పిల్లలతో ఆలయానికి చేరుకున్నారు. నిందితులలో ఒకడు అదే దేవాలయంలో కాంట్రాక్టు విధులు నిర్వర్తిస్తూ.. వీరిని గమనించి తన అనుచర గణానికి తెలిపాడు.
అనంతరం వివాహిత కాలకృత్యాలు తీర్చుకోడానికి తన బంధువుతో ఆలయానికి 150 మీటర్ల దూరానికి వెళ్లారు. అప్పటికే వారిని నలుగురు నిందితులు వెంబడించారు. మిగితా ముగ్గురు సెల్ ఫోన్ ద్వార సమాచారం ఇవ్వడంతో.. వారు ఘటన స్థలానికి చేరుకొని వివాహిత బంధువుపై దాడి చేసి.. ఆమెను ఏడుగురు కలిసి సాముహిక హత్యాచారం చేశారు. అనంతరం అత్యాచారానికి గురైన వివాహిత దాహమేస్తుందని నీళ్ళు అడగగా.. ఆమె ముఖంపై మూత్రం పోశారని జిల్లా ఎస్పీ తెలిపారు. అనంతరం వారి వద్ద ఉన్న బంగారు వస్తువులు, 6 వేల రూపాయలు తీసుకున్నరన్నారు. ఈ విషయం బయటకి చెప్తే మమ్మల్ని హత్య చేస్తామని వారిని బెదిరించారని ఎస్పీ అన్నారు. వారు బయటపడి దిక్కుతోచని పరిస్థితులలో సోమవారం ఉదయం ఉర్కొండ మండల పోలీసు స్టేషన్ ఫిర్యాదు చేశారని ఆయన తెలిపారు. ఈ కేసు డిఎస్పి వెంకటేశ్వర్లు, ఎస్ఐలు కృష్ణ దేవ,కురుమూర్తి, సిఐ లు నాగార్జున,విష్ణు వర్ధన్ రెడ్డి పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగించరన్నారు. సిసి పుటేజ్ ఆధారంగా మొదటగా ఆలయంలో పనిచేస్తున్న నిందితుడిపై దర్యాప్తు కొనసాగించగా.. కొన్ని అంశాలు బయటపడ్డాయని ఆయన అన్నారు.
వివాహితపై గ్యాంగ్ రేప్ చేసిన ఏడుగురిపై క్రైమ్ 34/2025, 70(గ్యాంగ్ రేప్), 351 (3 క్రిమినల్ ఇంటిమిడేషన్), 310( 2 డకోటి ) సెక్షన్ ల క్రింద నిందితులపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు. కేసు చేదించి తగిన ఆధారాలతో నిందితులను పట్టుకున్న కల్వకుర్తి డివిజన్ పోలీసులను మెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి డిఎస్పి పి. వెంకటేశ్వర్లు, సిఐ లు నాగార్జున, ఎస్ఐ లు మాధవ రెడ్డి, కృష్ణ దేవా, కురుమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు.

