Thursday, July 2, 2026
HomeTelanganaరెండిళ్లు.. 20 రోజులు..కరెంట్ బిల్లు రూ.1,75,706

రెండిళ్లు.. 20 రోజులు..కరెంట్ బిల్లు రూ.1,75,706

రెండు బల్బులు, ఒక ఫ్యాన్ కు రూ.వేలల్లో బిల్లులు

మా ఇల్లు అమ్మినా బకాయి తీరదు లబ్ధిదారులు

Post Midle

తెలంగాణ: నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో రెండు ఇళ్లకు ఏకంగా రూ.1,75,706ల కరెంట్ బిల్లులు రావడంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. మండల కేంద్రానికి చెందిన నల్ల వెళ్లి పుల్లయ్య ఇంటికి గత నెల 16 నుంచి ఈ నెల 5 వరకు 8672 యూనిట్లు రీడింగ్ తిరిగినట్లు రూ.87,338 బిల్లు వేశారు. నల్లవెళ్లి నిరంజన్ ఇంటికి 20 రోజులకు 8793 యూనిట్లు తిరిగినట్లు రూ.88,368 బిల్లు వేశారు. రెండు బల్బులు, ఒక ఫ్యాన్ ఉండగా రూ. వేలల్లో బిల్లులు ఎలా వేస్తారని లబ్ధిదారులు దళితులకు ఉచిత విద్యుత్తు అనే కారణంతో ఏళ్లుగా అధికారులు రీడింగ్ తీయలేదని.. ఇప్పుడు తమకు వేసిన బిల్లు చెల్లించాలంటే మా ఇల్లు అమ్మినా బకాయి తీరదని పుల్లయ్య కుమారుడు సైదులు వాపోయారు. అధికారులను అడిగితే పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని.. ఇంత బిల్లు రావడంతో ఏం చేయాలో తోచడం లేదన్నారు. దీనిపై ఏఈ శ్రీకాంత్ రెడ్డి ని వివరణ కోరగా.. గతంలో పని చేసిన సిబ్బంది నెలనెలా రీడింగ్ తీయకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని.. సమస్యను పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

తాము నివసిస్తున్న ఈ ఇంటికి రూ.87,338ల బిల్లు వచ్చిందంటూ

రసీదు చూపుతున్న పుల్లయ్య కుమారుడు సైదులు

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJ News App

Add to home screen for faster loading and latest updates.