
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల పట్టణం లోని టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు ముఖ్యఅతిథిగా విచ్చేసి పాల్గొన్న మంచిర్యాల ఎమ్మెల్యే సతీమణి నడిపెల్లి రాజకుమారి.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ మహిళలకు ప్రత్యేకమని, నూతన వస్త్రాలు ధరించి, సేకరించిన పూలతో అందంగా బతుకమ్మను పేర్చి పూజిస్తారని తెలిపారు. తెలంగాణ సంస్కృతిలో భాగమైన బతుకమ్మ పండుగ రాష్ట్రం, దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొంది ప్రత్యేకత సంతరించుకుందని తెలిపారు. మానవాళిని ప్రకృతికి దగ్గర చేసే కార్యక్రమం బతుకమ్మ పండుగ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి రాజకుమారి వెంట, సరోజ, ఆర్టీసీ అధికారులు మహిళలు తదితరులు పాల్గొన్నారు..

