తెలంగాణ వాహనదారులకు అలర్ట్..!
తెలంగాణ: తెలంగాణలోని వాహనదారులు తమ వాహనాలపై ఉన్న ట్రాఫిక్ చలాన్లు చెల్లించడానికి ప్రభుత్వం ఇచ్చిన రాయితీ గడువు శుక్రవారంతో ముగియనుంది. ఇప్పటి వరకు వాహనదారులు 2.92 కోట్ల చలాన్లు చెల్లించారు. తద్వారా ప్రభుత్వానికి రూ. 293 కోట్ల ఆదాయం వచ్చింది. విధించిన జరిమానాల్లో బైక్ లు, ఆటోలకు 75 శాతం, కార్లు, భారీ వాహనాలను 50 శాతం, ఆర్టీసీ బస్సులకు 70 శాతం, కరోనా వేళ మాస్క్ పెట్టుకోని వారి కేసుల్లో 90 శాతం రాయితీ కల్పించారు. ఆన్ లైన్, మీ సేవ కేంద్రాల్లో చలాన్లు చెల్లించవచ్చు…