ఆంజనేయులు న్యూస్: కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చేపట్టిన దేశవ్యాప్త కార్మిక సంఘాల సమ్మె తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోంది. రైతులు, కార్మికులను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపిస్తూ ఎక్కడికక్కడ నిరసన ర్యాలీలు నిర్వహించారు. రోజురోజుకీ నిత్యవసర, ఇంధన ధరలు పెరిగిపోతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు..