Telugu Updates
Logo
Natyam ad

ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత ఆటో సౌకర్యం..!

మంచిర్యాల జిల్లా: కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్డులో ఏర్పాటు చేసిన మాత శిశు ఆరోగ్య కేంద్రం వద్ద నుండి ఫ్లై ఓవర్ బ్రిడ్జి వరకు రోగులకు ఉచిత ఆటో సౌకర్యాన్ని బుధవారం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే పేషేంట్లు, గర్భిణి స్త్రీలు, వారి సహాయకులు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా ఎఐసిసి సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు ఉచిత ఆటో సౌకర్యాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.

ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు..