Telugu Updates
Logo
Natyam ad

చెట్లు నరికే వద్దని మంత్రికి వినతి..!

మంచిర్యాల జిల్లా: జిల్లాలోని రహదారి నిర్మాణంతో పాటు, నూతన నిర్మాణాల నూతన ప్రభుత్వ సముదాయాల నిర్మాణ సమయంలో 50 ఏళ్లకు పైగా ఏపుగా పెరిగిన పెద్ద వృక్షాలను దారుణంగా నరికి వేయవద్దని కోరుతూ బుదవారం మంచిర్యాల కు వచ్చిన మంత్రిని కలిసి, రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రికి బుధవార పర్యావరణ వేత్తలు గుండేటి యోగేశ్వర్ మరియు వెలుగు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మడుపు రామ్ ప్రకాష్ వినతి పత్రాన్ని రాష్ట్ర అటవీ  పర్యావరణ మంత్రి అ ఇంద్రకరణ్ రెడ్డి అందించి పలు విషయాలు విన్నవించారు. .

ఈ సందర్భంగా వారు మంత్రికి విన్న విస్తూ  ఏపుగా పెరిగిన పెద్ద చెట్లను నరకకుండా వాటిని జిల్లాలోని ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో లేదా జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న నూతన  కలెక్టరేట్ భవనంలో, వంద ఫీట్ రోడ్ లో, కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ లో “ట్రీ ట్రాన్స్ లొకేషన్” పద్ధతి ద్వారా పెద్ద  వృక్షాలకు పునర్జీవం పోయాలి అని కోరారు. లేదా  భవనాలు నిర్మాణాల ఇంజనీర్  ప్లానింగ్ లోనే  చెట్లు నరక కుండా ప్రణాళికలు రూపొందించే విధంగా చర్యలు తీసుకొని జిల్లాలో పచ్చదనం కాపాడాలని, పునర్జీవం చేయాలని కోరారు. వారి విజ్ఞప్తి మేరకు మంత్రి స్పందిస్తూ సాధ్యమయ పద్ధతులను అవలంభించ దానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు..