Telugu Updates
Logo
Natyam ad

ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనదారులపై స్పెషల్ డ్రైవ్..?

విధిగా హెల్మెట్ ధరించి, సరియైన వాహన ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలి: ట్రాఫిక్ ఏసిపి బాలరాజు

మంచిర్యాల జిల్లా: కేంద్రంలోని మార్కెట్ ఏరియా, ఐబీ చౌరస్తాలో ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనదారులపై శనివారం స్పెషల్ డ్రైవ్ ద్వారా ఫైన్స్ విధించిన ట్రాఫిక్ పోలీసులు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసిపి బాలరాజు మాట్లాడుతూ… ప్రతిఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ తమ గమ్యస్థానాలకు చేరుకోవలని కోరారు. విధిగా హెల్మెట్ ధరించి, సరియైన వాహన ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలని ప్రజలను కోరారు. వాహనం యొక్క నెంబర్ ప్లేట్ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి అని, పార్కింగ్ విషయంలో ఇతర వాహనదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని లేని యెడల ఈచల్లాన్ ద్వారా ఫైన్స్ వేయబడును అని తెలిపారు. మంచిర్యాల పట్టణంలో రూల్స్ పాటించని వారిపై 150 cases, డ్రంక్ అండ్ డ్రైవ్ cases 7 నమోదు అయ్యాయి. ఈ విధంగా పట్టణంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించబడుతుంది కావున వాహనదారులు  కచ్చితంగా సరియైన ధ్రువీకరణ పత్రాలు కలిగి, పెండింగ్ చలన లేకుండా చూడాలని కోరారు.

ఇట్టి స్పెషల్ డ్రైవ్ లో  గోదావరిఖని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ మరియు పెద్దపల్లి ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ దత్తు ప్రసాద్ మరియు మంచిర్యాల ట్రాఫిక్ సిఐ నరేష్ కుమార్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు..