Thursday, July 2, 2026
HomeTelanganaమంత్రి జగదీశ్ రెడ్డికి ఈసీ నోటీసు.. వివరణ ఇవ్వకపోతే చర్యలు తప్పవు

మంత్రి జగదీశ్ రెడ్డికి ఈసీ నోటీసు.. వివరణ ఇవ్వకపోతే చర్యలు తప్పవు

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం నోటీసు ఇచ్చింది.

Post Midle

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం నోటీసు ఇచ్చింది. ఈనెల 25న ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మంత్రి జగదీశె రెడ్డి చేసిన ప్రసంగంపై భాజపా నేత కపిలవాయి దిలీప్ కుమార్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, నల్గొండ జిల్లా ఎన్నికల అధికారి నుంచి కేంద్ర ఎన్నికల సంఘం నివేదిక తెప్పించుకుంది. తెరాసకు ఓటుకు వేయకపోతే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామంటూ రెడ్డి చేసిన ప్రసంగం ఎన్నికల ప్రవర్తనా జగదీశ్ నియమావళిని ఉల్లంఘించడమేనని భాజపా నేత ఫిర్యాదులో పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా జగదీశ్ రెడ్డి చేసిన ప్రసంగం నోట్ ను కూడా జిల్లా ఎన్నికల అధికారి పంపారు. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం ప్రాథమికంగా మంత్రి జగదీశ్ రెడ్డి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్టు అభిప్రాయపడింది. దీనిపై రేపు సాయంత్రం 3 గంటల్లోపు జగదీశ్ రెడ్డి వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం నోటీసులో పేర్కొంది. వివరణ ఇవ్వకపోతే తాము నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఈసీ స్పష్టం చేసింది.

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJ News App

Add to home screen for faster loading and latest updates.