మంచిర్యాల జిల్లా: జైపూర్ సబ్ డివిజన్ పరిధిలో ప్రతి పోలీస్ అధికారి నేరాల నియంత్రణకు సమిష్టిగా పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలో ఉత్తమ పోలీస్ స్టేషన్ గా జైపూర్ పోలీస్ స్టేషన్ ఎంపిక కావడానికి వర్టికల్ విధుల్లో రాణించిన పోలీస్ అధికారులు, సిబ్బందికి గురువారం రివార్డులు అందజేశారు. అలాగే హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి పొందిన సిబ్బందికి హెడ్ కానిస్టేబుల్ బ్యాడ్జి పెట్టి, వారిని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. గంజాయి రహిత సబ్ డివిజన్ గా జైపూర్ ను మార్చేందుకు కృషి చేయాలని ఎసిపి పిలుపునిచ్చారు. ఈ కార్యాక్రమములో శ్రీరాంపూర్ సిఐ బి. రాజు, జైపూర్ ఎస్ఐ రామక్రిష్ణ, అదనపు ఎస్ఐ గంగరాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.