Telugu Updates
Logo
Natyam ad

విషయం తెలుసుకొని స్పందించిన గ్రామ సర్పంచ్

కొమురంభీం జిల్లా :- రెబ్బెన మండలం నంబాల గ్రామంలో గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి గాలివాన బీభత్సం సృష్టించింది దీంతో ఊరి మధ్యలో ఎప్పటినుండో ఉన్న పురాతనమైన తాటి చెట్టు విరిగి కరెంట్ పోలు పై పడి వైర్లు ఎక్కడికక్కడ తెగిపోవడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది.సమాచారం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ చెన్న సోమశేఖర్ గారు వెంటనే స్పందించి కొద్ది నిమిషాల్లోనే విద్యుత్ శాఖ వారితో మాట్లాడి విద్యుత్ నిలిపివేసి అదేవిధంగా రోడ్డుకు అడ్డంగా పడిన తాటి చెట్టు మొద్దులను తొలగించి విద్యుత్ శాఖ వారితో మాట్లాడి కరెంట్ పోల్ మరియు వైరింగ్ పనులు దగ్గరుండి చేపించిన సర్పంచ్ గారు.. అలాగే వారు అడుగగానే స్పందించి మరమ్మతులు చేసిన విద్యుత్ శాఖ వారికి గ్రామ సర్పంచ్ మరియు గ్రామ ప్రజలు  కృతజ్ఞతలు తెలిపారు.