Telugu Updates
Logo
Natyam ad

తప్పిపోయిన బాలికను గుర్తించిన మంచిర్యాల పోలీసులు

మంచిర్యాల జిల్లా: మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆండాలమ్మ కాలనీకి చెందిన మాచర్ల కమల w/o గంగాధరి వయస్సు: 45 సంవత్సరాలు, కులం: వడ్డెర ఓసెన్: కూలీ వర్క్ r/o  అనే మహిళ తన కూతురు మాచెర్ల మహేశ్వరీ 26-04-2022 నుండి ఇంటి వద్ద కనబడుట లేదు అని తన కుటుంబ సభ్యులతో కలిసి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ వెతకడం జరిగిందని, బంధువులను కూడా ఫోన్ చేసి కనుక్కోవడం జరిగిందని ఎక్కడ కూడా ఆచూకీ లభించకపోవడంతో తేది 27-04-2022 రోజు మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ హరి శేఖర్ కేసు నమోదు చేసి పట్టణ నారాయణ గారి ఆదేశాల మేరకు వారి కుటుంబ సభ్యులు చెప్పిన ఆనవాళ్ల ఆధారంగా ఎస్ఐ హరి శేఖర్ సిబ్బంది దివాకర్, రాము తో కలిసి వెతకాగా శనివారం శ్రీరాంపూర్ ప్రాంతంలో బాలికను గుర్తించి, తల్లితండ్రులను పిలిపించి అప్పగించడం జరిగింది. తమ కూతురు తప్పిపోయిందని ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి  తాను గుర్తించి వారికి అప్పగించినందుకు మంచిర్యాల పట్టణ సిఐ నారాయణ, ఎస్ఐ హరి శేఖర్ సిబ్బంది దివాకర్, రాము లకు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలపడం జరిగింది..