Telugu Updates
Logo
Natyam ad

నా చావుకు సర్పంచ్ కారణమంటూ సెల్ఫీ సూసైడ్.?

కరీంనగర్ జిల్లా: సర్పంచ్ కారణంగా తాను ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నట్లు ఓ యువకుడు తీసిన సెల్ఫీ వీడియో వైరల్ గా మారింది. తన ఇంటికి దారి లేకుండా చేశాడని ఆరోపిస్తూ పురుగుల మందు తాగాడు.. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం షానగర్ సర్పంచ్ తనని వేధిస్తున్నాడని చిలుముల నరేష్ సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగాడు. కమ్యూనిటీ హాల్ నిర్మిస్తున్న గ్రామ టీఆర్ఎస్ సర్పంచ్ తన ఇంటికి దారి లేకుండా చేశాడని నరేష్ ఆరోపించారు. ఈ విషయంపై గ్రామ సెక్రటరీ కి దరఖాస్తు చేసుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో తమ ఇంటికి దారి లేకుండా చేశారని తన చావుకు కారణం షానగర్ టీఆర్ఎస్ సర్పంచ్, తిరుపతి, రాజు మల్లయ్యలే కారణమంటూ.. ఆ వీడియోలో పేర్కొని పురుగుల మందు తాగాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు నరేష్ ను కరీంనగర్ సివిల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన సర్పంచ్ కారణంగానే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ నరేష్ తీసిన వీడియో వైరల్ కావడంతో టీఆర్ఎస్ వర్గాల్లో గుబులు మొదలైంది. సర్పంచ్ తీరు పట్ల అధికార పార్టీకి తలనొప్పిగా మారింది..