డిల్లీ: హరియాణాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఢిల్లీ- జైపుర్ హైవేపై ఆగి ఉన్న ట్రక్కును ప్రయాణికులతో ఉన్న క్రూజర్ ఢీకొట్టడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 10 మందికి పైగా గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బాధితులను రాజస్థాన్ జైపుర్ లోని సమోద్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. వారంతా ఒకే కుటుంబానికి చెందివారు. ఇటీవలే మరణించిన తమ కుటుంబ పెద్ద అస్థికల నిమజ్జనం కోసం సోమవారం హరిద్వార్ కు వెళ్లారు. కార్యక్రమం ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.