Telugu Updates
Logo
Natyam ad

తెలంగాణకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ..!

ఏపీకి వారంలోగా వడ్డీతో సహా బకాయిలు చెల్లించండి..

తెలుగు అకాడమీ కేసులో తెలంగాణకు సుప్రీంకోర్టు ఆదేశం..

ధిల్లీ: తెలుగు అకాడమీ విభజన వ్యవహారంలో తెలంగాణకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీకి వారంలోగా వడ్డీతో సహా బకాయిలు చెల్లించాలని న్యాయస్థానం తాజాగా ఆదేశించింది. తెలుగు అకాడమీ విభజన వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈ కేసులో పిటిషన్ను వెనక్కి తీసుకునేందుకు తెలంగాణకు కోర్టు అనుమతిచ్చింది. అలాగే ఏపీకి చెల్లించాల్సిన రూ.92.94 కోట్లలో పెండింగ్ సొమ్మును వారంలోగా ఆ రాష్ట్రానికి ఇవ్వాలని ఆదేశించింది. మొత్తం సొమ్ముకు 6 శాతం వడ్డీ కలిపి ఇవ్వాలని కోర్టు పేర్కొంది. తెలుగు అకాడమీకి సంబంధించి 2021 జనవరిలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల అమలుకు నెల రోజుల సమయమిచ్చింది. ఆస్తులు, నిధుల  పంపకాలపై హైకోర్టు ఉత్తర్వులు అమల్లో ఉంటాయని సుప్రీం పేర్కొంది.