తెలంగాణ ఆర్టీసీ మాతృ దినోత్సవ కానుక.!
చంటిపిల్లలు ఉంటే ఆదివారం ఉచిత ప్రయాణం..
హైదరాబాద్: అయిదేళ్ల లోపు వయసున్న చంటి పిల్లలతో ప్రయాణించే మహిళలు ఆదివారం తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు అని తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివారం మాతృ దినోత్సవం సందర్భంగా తల్లులకు అభినందన సూచికగా ఈ కానుకను అందించాలని నిర్ణయించామన్నారు. ఆ ఒక్క రోజు మాత్రమే ఈ సదుపాయం ఉంటుందన్నారు.