Telugu Updates
Logo
Natyam ad

తెలంగాణలో అనేక విషయాల్లో అద్భుతాలు: కేసీఆర్

హైదరాబాద్:  ప్రజల మద్దతు, దేవుడి ఆశీస్సులతో ముందుకెళ్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో అనేక అనుమానాలు ఉండేవన్నారు. అన్నీ అధిగమించి ప్రగతి పథంలో నడుస్తున్నామన్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా ప్రగతిభవన్లో వేడుకలు నిర్వహించగా.. కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. అందరికీ శుభకృత్ నామ సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికీ సుఖం, శాంతి, ఐశ్వర్యం కలగాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ఈ రాష్ట్రంలో అనేక విషయాల్లో అద్భుతాలు జరిగాయని చెప్పారు. రాష్ట్ర ఆదాయం ఏటా పెరుగుతూనే ఉందన్నారు. విద్య, విద్యుత్, తలసరి ఆదాయంలో మంచి ఫలితాలు సాధించామని కేసీఆర్ వివరించారు. తెలంగాణలో భూముల ధరలు బాగా పెరిగాయని చెప్పారు. రాష్ట్రంలోని మారుమూల గ్రామానికి వెళ్లినా భూమి ధర పెరిగిందని కేసీఆర్ అన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి వల్లే భూముల ధరలు పెరిగాయని సీఎం చెప్పారు. దళితబంధు పథకం.. ఇంకా అద్భుతాలు ఆవిష్కరిస్తోందని వివరించారు. దేశానికి ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ మారుతోందని చెప్పారు. మన వనరులు, ఉద్యోగాలు మనకే దక్కాలని కేసీఆర్ అన్నారు.