అటవీ అభివృద్ధి సంస్థ జి.ఎం స్కైలాబ్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: భీమారం పాఠశాల స్థాయి నుంచే విధ్యార్థినీ, విధ్యార్థులు చదువు తో పాటు క్రీడల్లోనూ రాణించాలని, తద్వారా మానసిక ఉల్లాసం చేకూరుతుందని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ (టి.ఎస్.ఎఫ్.డి.సి) హైదరాబాద్ జనరల్ మేనేజర్ జి.స్కైలాబ్ పేర్కొన్నారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో భీమారం లోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు క్రీడా సామాగ్రి పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ. అటవీ అభివృద్ధి సంస్థ ప్రతి సంవత్సరం ఆర్జించిన లాభాల నుంచి రెండు శాతం చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన కొన్ని పాఠశాలలకు మరియు వైద్యశాలలు కు అవసరమైన కనీస సామాగ్రి, సదుపాయాలను కల్పించేందుకు సామాజిక సేవ కింద కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడుతూ అడవుల రక్షణ కు పాటు పడాలన్నారు. ఈ కార్యక్రమంలో కాగజ్నగర్ డివిజనల్ మేనేజర్ శ్రావణి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డి.విక్రమ్ కుమార్, మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ జి.సురేష్ కుమార్, పాఠశాల ఉపాధ్యాయులు, అటవీ అభివృద్ధి సంస్థ సిబ్బంది రాజేష్, శంకర్, సాయికిరణ్, రాకేష్, షాహిద్, సాయి తదితరులు పాల్గొన్నారు.

