మంచిర్యాలలొనీ గ్రీన్ సిటీలో కుక్కల బెడద
జాడ లేని కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స
గుంపులు గుంపులుగా కుక్కల విహారం..
వీధుల్లోకి వెళ్లాంటే జంకుతున్న జనం
ఈ విషయమై అసలు పట్టించుకోని మున్సిపల్ అధికారులు!
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా లో గ్రీన్ సిటీలో కుక్కల బెడద రోజురోజుకూ మరింతగా ఎక్కువవుతోంది. కుక్కలు గుంపులు గుంపులుగా స్వైర విహారం చేస్తున్నాయి. జిల్లాలో పలు ప్రాంతాలలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై వీధికుక్కలు దాడి చేస్తున్నా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే అరోపణలు లేకపోలేదు. రోజురోజుకూ కుక్కల దాడులు ఎక్కువవుతున్నాయి. కుక్కల దాడుల్లో అనేకమంది చిన్నారులు, మహిళలు గాయాలపాలవ్వడంతో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలుకూడా ఉన్నాయి. అధికారులు మాత్రం నియంత్రణ చర్యలు తీసుకోకుండా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని చెప్పుకోవచ్చు. మంచిర్యాల జిల్లాలోని గ్రీన్ సిటీలో కుక్కల స్వైర విహారంతో ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటే జనం జంకుతున్నారు. వీధి దీపాలు సైతం సరిగా లేకపోవడంతో కుక్కలు గుంపులు, గుంపులుగా సేద తీరుతున్నాయి. స్కూలుకు వెళ్లే పిల్లలు కానీ, పనుల నిమిత్తం వెళ్లేవారిపై కుక్కలు దాడికి పాల్పడుతుండడంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రీన్ సిటీ లొని వీధి కుక్కల దాడులు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని, కుక్కల బెడద నుంచి తమను రక్షించాలని, కుక్కల నియంత్రణకు కృషి చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు.