
ఆంజనేయులు న్యూస్, బాసర: శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని పద్మశ్రీ డా. గరికపాటి నరసింహరావు కుటుంబసభ్యులతో కలిసి బుధవారం దర్శించుకున్నారు. వీరికి ఆలయ అర్చకులు, అర్చక వైదిక బృందం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రవచన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సభలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


