క్రీడాకారులకు షూస్ పంపిణి చేసిన: ఎస్పీ సురేష్ కుమార్
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: వాలీ బాల్ క్రీడాకారులకు స్పోర్ట్స్ షూస్ ను జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ ఐపీఎస్ పంపిణీ చేసారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలో జరిగిన పోలీసులు మీ కోసం జిల్లా స్థాయి వాలీ బాల్ టోర్నమెంట్ లో జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ ఐపీఎస్ లో పాల్గొని గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. అనంతరం జైనూర్ వాలీ బాల్ జట్టు క్రీడకారులు అట నైపుణ్యం ప్రదర్శించడంలో ముందున్నప్పటికి వారి ఆర్థిక పరిస్థితులు. బాగులేక పోవడాన్ని గుర్తించిన జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ వారిని మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో పిలిపించి జైనూర్ జట్టు సభ్యులకు 8 జతల స్పోర్ట్స్ షూస్ అందజేశారు. దీంతో జైనూర్ జట్టు వాలీ బాల్ క్రీడాకారులు ఎస్పీకి కృతజ్ఞతలు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేశారు. క్రీడాకారులకు ఆర్థిక పరిస్థితులు అడ్డు కాకూడదని, యువత చదువుతో పాటు క్రీడల్లో ప్రధాన పాత్ర పోషించాలని అన్నారు. క్రీడల్లో రాణించే యువతకు తమ వంతుగా సహాయం అందించడానికి ఎల్లప్పుడూ ముందుంటామన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పి అచ్చేశ్వర్ రావు, సురేష్, ఆసిఫాబాద్ డీఎస్పీ శ్రీనివాస్, వాంకిడి సిఐ సుధాకర్ పాల్గొన్నారు.