Telugu Updates
Logo
Natyam ad

అనారోగ్యంతో ఏఆర్ కానిస్టేబుల్ మృతి..!

నిర్మల్ జిల్లా: సాయుధ దళ కార్యాలయంలో ఏఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న ఎండీ లతిఫోద్దిన్ అనారోగ్యంతో గురువారం మృతిచెందారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్ పట్టణంలోని నివాసానికి వెళ్లి పార్థివదేహనికి పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంత్య క్రియల నిమిత్తం రూ. 20 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ. ఏఆర్ కానిస్టేబుల్ ఎండీ లతిఫోద్దిన్ విధుల పట్ల మంచి పేరు పొందారని, వారి కుటుంబానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ప్రభుత్వపరంగా అందాల్సిన ఇతర బెనిఫిట్లను తక్షణమే అందజేసే విదంగా చూస్తామని తెలిపారు. ఇందులో ఎంటీఓ వినోద్, ఎస్ఐ అర్ఫాత్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుల్జ్ వీరసత్ అలీ, పోలీస్ సిబ్బంది ఉన్నారు..