మంచిర్యాల మహిళ పోలీస్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: రామగుండం సిపి ఆదేశానుసారం మంచిర్యాల జిల్లా షి టీమ్ ఇంచార్జ్, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ గురువారం జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్డులో గల అల్ఫోర్స్ స్మార్ట్ హై స్కూల్ లో విద్యార్థులకు, షి టీమ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.. ఈ సందర్బంగా ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ మాట్లాడుతూ.. షీ టీమ్ దాని యొక్క ప్రాముఖ్యత నిర్వహించే విధులు, మానవ అక్రమ రవాణా, ఫోక్సో చట్టాలు, బాల్య వివాహాలు దాని యొక్క పరిణామాలు, డ్రగ్స్ వలన కలిగే అనర్థాలు, ఈవ్ టిజింగ్, టీ సేఫ్ అప్లికేషన్, జువెనైల్ జస్టిస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్) యాక్ట్ (జెజె యాక్ట్) , మోటారు వాహనాల చట్టం, సైబర్ క్రైమ్స్ మరియు సైబర్ హెల్ప్ లైన్ నంబర్ 1930, డయల్ 100 ప్రాముఖ్యత, సమాజ రుగ్మతలు, సమాజంలో జరుగుతున్న నేరాలు వాటి నుండి ఎలా రక్షణ పొందాలి, మహిళల, పిల్లల రక్షణకు ఉన్న చట్టాల గురించి, సోషల్ మీడియా వల్ల జరుగు నష్టాలు లాభాల పై అవగాహన కల్పించారు.. ఎవరైనా డ్రగ్స్ సేవించిన, మహిళలను వేధించిన, రోడ్డుపై వెళ్లేటప్పుడు అవహేళనగా మాట్లాడిన, ఉద్దేశపూర్వకంగా వెంబడించిన వెంటనే డైల్ 100 లేదా రామగుండం షీ టీమ్ నెంబర్ 6303923700 కు ఫిర్యాదు చేసినచో వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, షీ టీం తో మహిళలకు భద్రత భరోసా ఉంటుందని తెలిపారు.. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా షి టీమ్ ఎస్ ఐ హైమ, కానిస్టేబుల్స్ శ్రవణ్,జ్యోతి, సతీష్, శ్రీలత, శైలజ, అల్ఫోర్స్ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు..

