
ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: ఉప్పల్ మైదానంలో ఆదివారం జరగనున్న టీ20 క్రికెట్ మ్యాచ్ కోసం భారత్, ఆసీస్ ఆటగాళ్లు ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో శంషాబాద్ వద్ద భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆటగాళ్లను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి తరలి వచ్చారు. నగరంలోని తాజ్ కృష్ణ హోటల్ లో ఆస్ట్రేలియా ఆటగాళ్లకు, హోటల్ పార్క్ హయత్ లో భారత ఆటగాళ్లకు బస ఏర్పాట్లు చేశారు. ఉప్పల్లో రేపు జరగనున్న మ్యాచ్ లో హైదరాబాద్ లో సందడి వాతావరణం నెలకొంది. మూడు మ్యాచ్ ల సిరీస్ 1-1తో సమం కావడంతో మూడో టీ20 మ్యాచ్ ఇరుజట్లకు కీలకం కానుంది. మరోవైపు, తొలి టీ20 మ్యాచ్ లో టీమ్ండియా భారీ స్కోరు చేసినప్పటికీ బౌలింగ్, ఫీల్డింగ్ ఫెలవటం తో ఓటమి చవిచూసింది. నిన్న జరిగిన రెండో మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో విజయం సాధించింది. అదే జోరును రోహిత్ సేన కొనసాగించాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటుకున్నారు. టీ20 ప్రపంచకప్ కు ముందు టీమ్ ఇండియా ఈ సిరీస్ గెలవడం కూడా ఎంతో కీలకం.

