Thursday, July 2, 2026
HomeTelanganaపోడు భూములకు పట్టాల పంపిణీ అంతా ఉత్తదే.

పోడు భూములకు పట్టాల పంపిణీ అంతా ఉత్తదే.

Post Midle

ఆంజనేయులు న్యూస్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా: పోడు భూములకు పట్టాల పంపిణీ చేస్తున్నట్లు యాక్షన్లు చేయడం బి ఆర్ ఎస్ ప్రభుత్వ ఎలక్షన్ స్టంట్ అని బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు భూక్యారాజు శనివారం అన్నారు. ఆయన మాట్లాడుతూ.. పోడు భూములలో గతంలో దుక్కులు దున్న తున్న రైతులపై కేసులు పెట్టింది ఎవరని, అమాయక ఆదివాసి ప్రజలపై అక్రమ కేసులు బనాయించి వారిని ఎన్నో ఇబ్బందులకు గురి చేశారన్నారు. ప్రజలారా దయచేసి ఆలోచించండి పోడు భూములు చేసుకుంటున్న రైతుల దగ్గర నుండి భూములను లాక్కున్న ప్రభుత్వం ఏది. పోడు భూములు చేసుకుంటున్న రైతుల మీదకు ఫారెస్ట్ ఆఫీసర్లను ఉసిగొలిపింది ఏ ప్రభుత్వము. పోడు భూములు చేసుకుంటున్న రైతుల మీద కేసులు పెట్టి జైలుకు పంపించింది ఏ ప్రభుత్వము ఆలోచించండి ప్రజలారా, మన పోడు భూములు మనకే తిరిగి ఇస్తున్నట్టుగా ఈ బి ఆర్ ఎస్ ప్రభుత్వం కల్లబొల్లి కబుర్లు చెబుతూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో కొత్త రాజకీయాలు మొదలుపెట్టి మళ్లీ పోడు భూములకు పట్టాల కార్యక్రమం తెరపైకి తీసుకువచ్చారన్నారు. ప్రజలు ఇప్పటికైనా గమనించాలని ఆయన కోరారు..

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJ News App

Add to home screen for faster loading and latest updates.