Thursday, July 2, 2026
HomeTelanganaఆర్టీసీ డ్రైవర్లకు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం..!

ఆర్టీసీ డ్రైవర్లకు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం..!

📰 Generate e-Paper Clip

ఆర్టీసీ బస్ డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్న మంచిర్యాల ట్రాఫిక్ సిఐ నరేష్ కుమార్

Post Midle

మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని  మంచిర్యాల ఆర్టీసీ బస్ స్టాండ్ లోనీ డిపో వద్ద మంగళవారం బస్ డ్రైవర్లకు ట్రాఫిక్ రూల్స్ పై మరియు ప్రయాణికుల భద్రత విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో తగు సూచనలతో అవగాహన కార్యకమం నిర్వహించనైనది. ఈ సందర్భంగా  ట్రాఫిక్ సిఐ నరేష్ కుమార్ మాట్లాడుతూ… ఆర్టీసీ  డ్రైవర్లు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సంయమనం పాటించాలని, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయరాదని, నిర్దేశించిన వేగంతో మాత్రమే బస్ ను నడపాలని, పట్టణ ప్రాంతాల్లో బస్ స్టాండ్ల వద్ద మాత్రమే నిలపాలని, ఇతర వాహనదారులకు ఇబ్బంది కలిగించే విధంగా పార్కింగ్ చేయరాదని, ఓవర్ టేకింగ్ చేస్తున్నప్పుడు అన్ని జాగర్తలు తీసుకోవాలని, పట్టణ ప్రాంతాల్లో ఓవర్ టేకింగ్ చేయకుండా నడపాలని,  కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ కచ్చితంగా పాటించాలని సూచించారు.

ఈ అవగాహన కార్యక్రమంలో మంచిర్యాల ట్రాఫిక్ సిఐ నరేశ్ కుమార్, ఆర్టీసీ డిపో డిఎం రవీంద్రనాథ్, ఆర్టీసీ డ్రైవర్లు మరియు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు..

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJ News App

Add to home screen for faster loading and latest updates.