Telugu Updates
Logo
Natyam ad

ఆ థియేటర్ లో ‘ఆర్ఆర్ఆర్’ సెకండాఫ్ వేయలేదట!

ఆంజనేయులు న్యూస్: అమెరికాలోని ఓ థియేటర్లో ‘RRR’ సినిమా చూడటానికి వెళ్లిన ప్రేక్షకులకు ఊహించని పరిణామం ఎదురైంది. ఫస్టాఫ్ పూర్తవగానే సినిమా అయిపోయినట్లు ప్రకటించడంతో థియేటర్కు వచ్చిన ప్రేక్షకులు ఒక్కసారిగా కంగుతిన్నారు. అభిమానులు అసహనంతో ఊగిపోయారు. అమెరికాలోని సినీమార్క్ థియేటర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. రివ్యూవర్ అనుపమ చోప్రా ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా పంచుకున్నారు..

ఇంతకీ ఏం జరిగిందంటే..
అమెరికాలోని సినీమార్క్ థియేటర్కు రివ్యూవర్ అనుపమ చోప్రా సహా పలువురు అభిమానులు ‘ఆర్ఆర్ఆర్’ చూడటానికి వెళ్లారు. ప్రథమార్ధం అయిపోగానే సినిమా పూర్తయినట్లు థియేటర్లో ప్రకటించారు. దీంతో ఇదేంటని సినిమాకు వచ్చిన వారు యాజమాన్యాన్ని ప్రశ్నించారు. సినిమా నిడివి 3గంటలు ఉందని తమకు తెలియదని అందుకే ఇంతవరకే అనుకుని ప్రదర్శించామని మేనేజర్ వివరణ ఇచ్చారు. కొద్దిసేపు చర్చల అనంతరం సెకండాఫ్ స్క్రీనింగ్ వేశారు. సినిమా నిడివి గురించి సినీమార్క్ థియేటర్కు అవగాహన లేకపోవటం వల్లే ఇలా జరిగిందని అనుపమ చోప్రా చెప్పుకొచ్చారు.. గతంలోనూ భారతీయ చిత్రాలను ప్రదర్శించే సమయంలో నిడివిపై అవగాహన లేక మధ్యలోనే సినిమా ఆపేసిన సందర్భాలు ఉన్నాయంటూ పలువురు నెటిజన్లు ట్విటర్ వేదికగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా నటించిన ‘ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. కలెక్షన్ విషయంలో తొలిరోజు ‘బాహుబలి’ రికార్డులను బద్దలు కొట్టింది. ఎన్టీఆర్, రామ్చరణ్ నటన, రాజమౌళి టేకింగ్ సినిమాను విజయం పథంలో నడిపాయి..