Telugu Updates
Logo
Natyam ad

రేవంత్, కవిత ట్వీట్ వార్..?

హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డీ, తెరాస ఎమ్మెల్సీ కవిత మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు, రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ పై కవిత విమర్శలు చేశారు. రాష్ట్ర హక్కుల కోసం.. దేశవ్యాప్తంగా ఒకే వరి కొనుగోలు విధానంపై తెరాస పోరాడుతున్నప్పుడు రాహుల్ ఎక్కడున్నారని ఆమె ట్విటర్ లో ప్రశ్నించారు. దీనికి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రైతు వ్యతిరేక చట్టాలను ప్రధాని మోదీ తెచ్చినప్పుడు మీరెక్కడున్నారని ప్రశ్నించారు. మీ తండ్రి మోదీ ముందు మోకరిల్లి బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని లేఖ ఇచ్చి రైతులకు ఉరి తాళ్లు బిగించినప్పుడు మీరు ఎక్కడ?” అని రేవంత్ ట్వీట్ చేశారు.