Telugu Updates
Logo
Natyam ad

డీసీపీ కి వినతిపత్రం అందజేసిన ఆదివాసీ నాయకులు

మంచిర్యాల జిల్లా: దండేపల్లి మండలం మాకులపేట గ్రామ పంచాయతీ పరిధిలో కోయపోషగూడెం లో కొన్నిరోజుల క్రితం అటవీ & పోలీస్ శాఖ వారు ఆదివాసీ మహిళలపై జరిపిన దాడుల విషయాల ను విన్నవిస్తు మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్ కు ఆదివాసీ నాయకులు వినతి పత్రం అందజేశారు. కోయపోషగూడెం ఘటన పై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలనీ ఆదివాసీ నాయకులు కోరారు.

ఈ కార్యక్రమం లో ఆదివాసీ సేన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రధానకార్యదర్శి రాయడం, జంగు పటేల్, ఆదివాసీ సేన మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కోట్నాక్ తిరుపతి, కాంత్తే భూచన్న, ఆత్రం జలపతి, కుంఠం భీంరావు, కోయపోషగూడెం గ్రామస్తులు, పోడు భూమి భాదిత మహిళ రైతులు పాల్గొన్నారు..