
జిల్లా కలెక్టర్, జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు భారతి హోళ్ళికేరి
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల జిల్లా శాఖకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు రావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్, జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు భారతి హోళికేరి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్ లో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ కంకణాల భాస్కర్ రెడ్డి జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు మాట్లాడుతూ హైదరాబాద్ లొనీ రాజభవన్ దర్భార్ లో నిర్వహించిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర శాఖ 2019-20, 2020-21, 2021-22 సంవత్సరాల వార్షిక సర్వసభ్య సమావేశంలో వివిధ సేవా కార్యక్రమాలలో విశిష్ఠ సేవలు అందిస్తున్న రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖకు రాష్ట్ర గవర్నర్ డా॥ తమిళసై సౌందరరాజన్ చేతుల మీదుగా పతకాలు స్వీకరించడం జరిగిందని తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రక్తనిధి కేంద్రానికి సింగరేణి సంస్థ సౌజన్యంతో అంబులెన్స్ ఏర్పాటు చేయడంపై బంగారు పతకం, రక్తనిధి కేంద్రానికి లక్షల విలువ గల పరికరాలను సమకూర్చినందుకు మరొక బంగారు పతకం, సాధారణ విరాళాలు, మెగా రక్తదాన శిబిరాల నిర్వహణలో రెండు మెరిట్ సర్టిఫికెను పొందడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ కొరకు చేసిన కృషి, సేవలను గాను జిల్లా కలెక్టర్ కు వచ్చిన సేవా అవార్డుతో పాటు పతకాలను జిల్లా చైర్మన్ కంకణాల భాస్కర్ రెడ్డీ మర్యాదపూర్వకంగా కలిసి అందజేసి సొసైటీ అభివృద్ధికి కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.

