మంచిర్యాల జిల్లా: నస్పూర్ మున్సిపాలిటీ 16వ వార్డు పరిధిలోని లబ్ధిదారులకు ఆదివారం మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. స్థానిక శారద శిశు మందిర్ పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 223 మంది లబ్దిదారులకు ఆయన పట్టాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సింగరేణి ప్రాంతంలో సుదీర్ఘ కాలంగా నివసిస్తున్న కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్, పీఏసీఎస్ చైర్మన్ సందేలా వెంకటేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, తెరాస పట్టణ అధ్యక్షులు అక్కురి సుబ్బయ్య, కార్యదర్శి మెరుగు పవన్ కుమార్, కౌన్సిలర్లు పూదరి కుమార్, కురిమిళ్ల అన్నపూర్ణ, లావణ్య, గంగ ఎర్రన్న, బండి పద్మ, కోప్షన్ సభ్యులు భాగ్యలక్ష్మి, మహిళా నాయకురాలు వైద్య శ్రీలత, పట్టణ యూత్ అధ్యక్షులు చెల్ల విక్రమ్, కార్యదర్శి కాటం రాజు, తదితరులు పాల్గొన్నారు.