Telugu Updates
Logo
Natyam ad

సర్కారు దవాఖానాల్లో ప్రైవేట్ ఫార్మసీలు బంద్.!

తెలంగాణ: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేట్ ఫార్మసీలను తీసేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. దీనిపై మంత్రి హరీశ్ రావు ఆదేశాలతో వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా మందులు పంపిణీ చేస్తుండగా, ప్రైవేట్ ఫార్మసీలు ఉండడం సరికాదని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దీంతో బోధనాసుపత్రులు, జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లోని ప్రైవేట్ ఫార్మసీలను తీసేయాలని ఆదేశాలిచ్చింది. దీనిపై ప్రైవేటు ఫార్మసీ షాపుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అవసరమైతే కోర్టుకు వెళ్లి, ప్రభుత్వ ఆదేశాలను నిలుపుదల చేసేందుకు వారు సిద్ధం అవుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేట్ ఫార్మసీల ఉండడం వల్ల రోగులకు వైద్యులు అక్కడి మందులే రాస్తున్నారని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రైవేట్ ఫార్మసీలలోని మందులే ఉత్తమమైనవిగా ప్రజలు భావించే అవకాశం ఉందని, అంతేకాకుండా ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత మందులను వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల దుకాణాల ద్వారా మెడిసిన్స్ సరఫరాకు ప్రభుత్వం ఏటా రూ.500 వరకు కేటాయిస్తోంది. అయినప్పటికీ బోధనాసుపత్రులు, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల ప్రాంగణాలలో కొన్ని ప్రైవేట్ మందుల షాపులకు గతంలో అనుమతులు ఇచ్చింది. తాజాగా వాటిని రద్దు చేయాలని