Friday, July 3, 2026
HomeTelanganaప్రధానమంత్రి భారత్ వికసిత్ సంకల్ప్ యాత్ర

ప్రధానమంత్రి భారత్ వికసిత్ సంకల్ప్ యాత్ర

📰 Generate e-Paper Clip

జిల్లా పాలనాధికారి బదావత్ సంతోష్

Post Midle

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 16వ తేదీ నుండి జిల్లాలో ప్రధానమంత్రి భారత్ వికసిత్ సంకల్ప్ యాత్ర నిర్వహించడం జరుగుతుందని జిల్లా పాలనాధికారి బదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని జిల్లా కలెక్టర్ చాంబర్లో జిల్లా అదనపు పాలనాధికారి (స్థానిక సంస్థలు) బి.రాహుల్తో కలిసి జిల్లా అధికారులతో సంకల్ప్ యాత్ర నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ ప్రజల సంక్షేమాభివృద్ధి కొరకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలపై జిల్లా వ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వంచే అమలు చేయబడుతున్న ఆయుష్మాన్ భారత్, గరీభ్ కళ్యాణ్, అన్నయోజన, ధీన్దేయాళ్ అంత్యోదయ యోజన, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్, ఆవాస్ యోజన, ఉజ్వల యోజన, విశ్వకర్మ యోజన, కిసాన్ సమ్మాన్ నిధి, కిసాన్ క్రెడిట్ కార్డు, జీవన్ జ్యోతి భీమా యోజన, సురక్ష భీమా యోజన ఇతరత్రా కేంద్ర ప్రభుత్వ పథకాలపై అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ప్రజలకు అర్థమయ్యే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. జిల్లాలో రోజుకు 2 గ్రామపంచాయతీల చొప్పున జనవరి 26వ తేదీ వరకు గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సంబంధిత సిబ్బంది తదిరులు పాల్గొన్నారు.

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJI News App

Add to home screen for faster loading and latest updates.