తెలంగాణ: తెలంగాణ సీఎం కేసీఆర్. అబద్ధాల సంఘం అధ్యక్షుడని చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఓ మీడియాతో మాట్లాడుతూ సమకాలీన రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉద్యమ నేతగా కేసీఆర్ ను తొలి ఎన్నికల్లో గెలిచారని, ఆ తర్వాత ప్రలోభాలతో రెండవ ఎన్నికలతో అధికారం దక్కించారని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ రాక్షస రాజకీయ క్రీడకు తెరలేపారన్నారు. కేసీఆర్ కుటుంబ పాలనలో రైతులు చితికి పోయారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ధాన్యం సమస్యను సృష్టించారని అన్నారు. ధనిక రాష్ట్రాన్ని దారుణ పరిస్థితుల్లోకి కేసీఆర్ నెట్టారని, అన్ని వ్యవస్థలూ కుప్పకూల్చారని మండిపడ్డారు. నిజాం వారసుల కంటే కేసీఆర్ కుటుంబంలోని వారి ఆస్తులే ఎక్కువన్నారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో ఎక్కువ రాష్ట్రాలలో అధికారంలోకొచ్చామని రేవంత్ రెడ్డి అన్నారు.
ఆయన నాయకత్వంపై ఎలాంటి అనుమానాలు లేవన్నారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉందని, అందుకే తమ పార్టీ నేతలు బహిరంగంగా తమ అభిప్రాయాలు చెబుతున్నారని అన్నారు. తమ పార్టీలో భిన్నాభిప్రాయాలున్నా అంతా ఒక్కటిగానే ఉన్నామని చెప్పారు. తెలంగాణ సమాజానికి కేసీఆర్ ప్రమాదకరమైన వ్యక్తి అని రేవంత్ అన్నారు. రాష్ట్రంలో ప్రజలు మార్పు తాము వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం తథ్యమని చెప్పారు.